పటిష్ట స్థితిలో వెస్టిండీస్
ముంబై,నవంబర్ 22: భారత జట్టుతో జరుగుతున్న మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ధీటైన ఆటతీరును కనబరిచింది. వెస్టిండీస్ జట్టులో నలుగురు ఆటగాళ్లు భరత్, బ్రాత్‌వెయిట్, ఎడ్వార్డ్స్, బ్రావోలు అర్ధ సెంచరీలు నమోదు చేసుకున్నారు. భరత్ 62, బ్రాత్ వెయిట్ 68 పరుగులు చేసి అవుటయ్యారు. ఎడ్వర్డ్స్ 65, బ్రావో 57 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. రెండు వికెట్లు కూడా అశ్విన్‌కే దక్కాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Comments