అబ్దుల్ కలాంకు అమెరికాలో అవమానం
న్యూఢిల్లీ,నవంబర్ 13: : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్దుల్ కలాంకు అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అవమానం ఎదురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలాం ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు రెండుసార్లు కలాంను ఒళ్లంతా తడిమి చూసే ప్రయత్నాలు చేశారు. ఓ కార్యక్రమానికి హాజరై గత సెప్టెంబర్‌లో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో న్యూయార్కు ఎయిర్ పోర్టు అధికారులు ఆయన ఒళ్లంతా తడిమి చూసే ప్రయత్నాలు చేశారు. ఎయిరిండియా ప్రతినిధులు అభ్యంతరం చెప్పినప్పటికీ వారు కలాం బూట్లు, కోటు విప్పి తనిఖీలు చేశారు. కాగా 2009లోనూ న్యూఢిల్లీలో కలాంను పూర్తిగా తనిఖీ చేసి ఓ ఎయిర్ లైన్స్ అధికారులు అవమానపర్చారు. ఇలాంటి సంఘటన ఆయనకు ఎదురుకావడం ఇది రెండోసారి.
Comments