వైట్ హౌస్ వద్ద కాల్పులు
వాషింగ్టన్,నవంబర్ 12: వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ సమీపంలో శుక్రవారం కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి రూస్ వెల్ట్ బ్రిడ్జి మీదుగా పరిగెత్తినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనతో వాషింగ్టన్ డీసీ మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఆ కాల్పులు శ్వేతసౌధాన్ని గురిపెట్టి జరిగాయని చెప్పడానికి ఆధారాలు లెవని అధికారులు అంటున్నారు. పశ్చిమ దిశగా రెండు వాహనాలు వెళ్లినట్లు కూడా వారు గుర్తించారు. కాగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కాలిఫోర్నియాలో ఉన్నారు. .
Comments