చెర విడిన 'సత్యం' రాజు
న్యూఢిల్లీ,నవంబర్ 4: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, ఆడిటర్ వడ్లమాని శ్రీనివాస్ లకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికీ రెండు లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ, ట్రయిల్ కోర్టు విచారణకు సహకరించాలని సూచించింది. గత రెండు సంవత్సరాల ఎనిమిది నెలలుగా రామలింగరాజు జైల్లో ఉన్నారు. 2009లో ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Comments