చంద్రపాల్ సెంచరీ: విండీస్ 256/5
న్యూఢిల్లీ,నవంబర్ 6: భారత్‌తో ఆదివారమిక్కడ ప్రారంభమయిన మొదటి టెస్ట్ లో వెస్టిండీస్ ఆటగాడు శివనారాయణ చంద్రపాల్ సెంచరీ సాధించాడు. 144 బంతుల్లో 6 ఫోర్లు , 2 సిక్సర్లతో సెంచరీ పూర్తిచేశాడు. టెస్ట్ లలో చంద్రపాల్ కిది 24వ శతకం. తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న విండీస్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. చంద్రపాల్ 111, బాగ్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బ్రాత్‌వేట్ 63, పావెల్ 14, ఎడ్వార్డ్స్ 15, బ్రేవో 12, శ్యామూల్స్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఓజా 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు.
Comments