అమితాబ్ కు ఆస్ట్రేలియా డాక్టరేట్
బ్రిస్‌బేన్ , అక్టోబర్ 21: బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ( గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ప్రపంచ సినిమా రంగానికి అమితాబ్ చేసిన విశేష సేవలకుగానూ ఆయనకీ డాక్టరేట్‌ను ఇచ్చారు. గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్‌ను స్వీకరించిన అనంతరం అమితాబ్ మాట్లాడుతూ.. ఈ గౌరవం పొందినందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తన తొలి హాలీవుడ్ చిత్రంషూటింగ్ కోసం సిడ్నీలో ఉన్న అమితాబ్ డాక్టరేట్ స్వీకరించేందుకు గురువారం ఉదయం బ్రిస్‌బేన్‌కు వచ్చారు. రెండేళ్ల క్రితమే క్వీన్స్లాండ్ యూనివర్సిటీ అమితాబ్ కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. అయితే, అప్పట్లో ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరిగిన జాతి వివక్ష దాడులకు నిరసనగా ఆయనీ డాక్టరేట్‌ను స్వీకరించలేదు.
Comments