లోకాయుక్త కోర్టులో లొంగిపోయిన యడ్యూరప్ప
బెంగళూరు,అక్టోబర్ 15: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లోకాయుక్త కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఈ నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భూ కేటాయింపులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్ప అరెస్ట్ కు ఈ ఉదయం లోకాయుక్త కోర్టు వారెంట్ జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనే వచ్చి కోర్టులో లొంగిపోయారు.
Comments