కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం
హైదరాబాద్,అక్టోబర్ 5: మంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ బుధవారం ఆమోదించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సిఫారసు మేరకు కోమటిరెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయకుంటే రాజీనామా చేస్తానన్న గడువు సెప్టెంబర్ 30 తో ముగియడంతో అక్టోబర్ 1 న కోమటిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments