అన్నా హజారే టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్ పై దాడి
న్యూఢిల్లీ,అక్టోబర్ 19: అన్నా హజారే టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్ పై లక్నోలో మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. లక్నోలోని ఝలేలాల్ పార్క్ లో ఏర్పాటైన బహిరంగ సభలో ఈ దాడి జరిగింది. ఆయన పైకి బూటు విసిరి ఓ వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నించాడు. దాడి చేసిన వ్యక్తిని జులాన్‌కు చెందిన జితేంద్ర పాఠక్‌గా గుర్తించారు. ఆ వ్యక్తిని స్వచ్ఛంద సేవకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేజ్రీవాల్‌తో తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, అవినీతిపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆ వ్యక్తి అన్నాడు. తాను ఏ రాజకీయ పార్టీకీ చెందినవాడిని కానని అతను చెప్పాడు. కాగా అన్నా టీమ్ మరో సభ్యుడు ప్రశాంత్ భూషణ్‌పై జరిగిన దాడిని మరిచిపోక ముందే కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. కేజ్రీవాల్‌పై దాడిని ప్రస్తావిస్తూ తాము బెదిరిపోవడం లేదని, అవినీతిని అంతం చేయడానికి తాము బుల్లెట్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నా హజారే అన్నారు.
Comments