ప్రకటన వచ్చేంత వరకు సమ్మె: కోదండరాం
హైదరాబాద్,అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ సమ్మె కొనసాగుతుందని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. రావణ దహనానికి బదులు దశ కంఠ కాంగ్రెస్ కటౌట్లను దహనం చేయాలని అన్నారు. సమ్మె ను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనల్ని ఉధృతం చేస్తామన్నారు. సమ్మె ఉధృతం చేయడానికి 7, 8 తేదిల్లో వ్యూహ రచన చేస్తామని ఆయన తెలిపారు. 9,10 తేదిల్లో రైల్‌రోకో యథాతథంగా ఉంటుందన్నారు. తెలంగాణపై కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యల్ని కోదండరామ్ ఖండించారు.
Comments