నాగం గ్యాంగ్ హల్చల్
హైదరాబాద్,అక్టోబర్ 2: తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు నాగం జనార్దన రెడ్డి, వేణుగోపాల చారి, హరీశ్వర రెడ్డి, జోగు రామన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ రాజీనామాలు ఆమోదించేవరకు కదిలేది లేదని వారు డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో తలుపులు గడియ పెట్టుకుని బైఠాయించిన వారిని పోలీసులు శనివారం రాత్రి 11 గంటల తరువాత అరెస్ట్ చేశారు. పోలీసులు ఆ గది తలుపులు పగులగొట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని వదిలిపెట్టాలని కొందరు న్యాయవాదులు, తెలంగాణవాదులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఆ తరువాత టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వారి వారి ఇళ్లకు తరలించారు.
Comments