తడిసి మోపెడవుతున్న పోలీసు బందోబస్తు ఖర్చు
హైదరాబాద్,,అక్టోబర్ 3: రాష్ట్రంలో ఉద్యమాల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఖర్చు తడిసి మోపెడవుతోంది. రాష్ట్ర పోలీసులనే కాకుండా కేంద్ర బలగాలను కూడా రప్పించి ఉద్యమాలు, ఆందోళనలకు బందోబస్తు కల్పిస్తున్నారు. ఈ విధుల్లో పాల్గొంటున్న కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులకు ట్రావెలింగ్ అలవెన్స్, బత్తా, డ్యూటీ అలవెన్స్ తో పాటు వసతి, భోజన సౌకర్యం కోసం అదనంగా రూ.84 కోట్లు మంజూరు చేయాలని పోలీసు శాఖ కోరింది. ఆర్థిక శాఖ మాత్రం రూ.33 కోట్లే ఇచ్చింది. దీంతో మిగతా మొత్తాన్ని కూడా ఇవ్వాలని హోం శాఖ కోరుతోంది.
Comments