తిరుమల గరుడోత్సవంలో డప్పేసిన బాపిరాజు
తిరుపతి,సెప్టెంబర్ 3: తిరుమల బ్రహ్మోత్సవాలలో ప్రధానమైన గరుడోత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. పూల దండలతో అద్భుతంగా అలంకరించిన గరుడ వాహనంపై స్వామివారిని మాడ వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, అధికారులు నృత్యాలు చేశారు. బాపిరాజు స్టెప్పులు వేయడంతోపాటు డప్పు కూడా మోగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Comments