పోర్ట్ లాండ్ హార్వెస్ట్ త్రో మీట్‌లో భారత్ కు బంగారు పతకం
న్యూఢిల్లీ,అక్టోబర్ 13: భారత డిస్కస్ త్రో క్రీడాకారిణి పునియా అమెరికాలోని పోర్ట్ లాండ్ లో జరిగిన హార్వెస్ట్ త్రో మీట్‌లో బంగారు పతకం సాధించింది. అయితే 2012లో లండన్‌లో జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో ఆమె విఫలమయింది. ఒలింపిక్స్ అర్హత సాధించాలంటే 59.50 మీటర్ల మార్క్ ను అందుకోవాలి. కానీ ఆమె 59.39 మీటర్లు దూరానికి మాత్రమే దిస్కస్ విసిరింది. అమెరికాలో జరగనున్న మరో రెండు ఈవెంట్‌లలో గెలిచి ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని పునియా విశ్వాసం వ్యక్తం చేసింది.
Comments