పొన్నం , జీవన్‌రెడ్డిలకు 14 రోజుల రిమాండ్
కరీంనగర్,అక్టోబర్ 15: కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మాజీ మంత్రి జీవన్‌రెడ్డిలకు జిల్లా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రైల్‌రోకో సందర్భంగా ఈ ఇద్దరు నాయకులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కాగా ప్రభుత్వ వ్యవహారశైలిని కోదండరామ్ ఖండించారు. తెలంగాణ మంత్రుల వైఖరిని గర్హిస్తున్నామన్నారు. తెలంగాణవాదులు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించలేదన్నారు. అరెస్ట్ లకు నిరసనగా సోమవారం తెలంగాణ బంద్ పాటించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.
Comments