సకల జనుల ఖర్మ...
హైదరాబాద్,సెప్టెంబర్ 19: సకల జనుల సమ్మెకు మద్దతుగా సోమవారం నుంచి తెలంగాణ పరిధిలో ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ బస్సులు రోడ్డుపైకి వచ్చిన దాఖలాలు లేవు. దీనితో ఆటోలు, ప్రయివేట్ వాహనాలకు భారీగా గిరాకి పెరిగింది. ప్రయాణికుల నుంచి అధిక మొత్తం డిమాండ్ చేస్తున్నారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో రైల్వే అధికారులు సోమవారం ఉదయం ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచారు. సికింద్రాబాద్- లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి, సికింద్రాబాద్-మేడ్చల్ రూట్లలో 120 సర్వీసులను తిప్పుతున్నారు. అలాగే ఎంఎటీఎస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. వీటితో పాటు తెలంగాణ జిల్లాల మీదగా వెళ్లే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Comments