గాయంతో వన్డే సిరీస్ నుంచి సచిన్ అవుట్
సౌతాంప్టన్ , సెప్టెంబర్ 5: ఇంగ్లాండుతో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి గాయాల కారణంగా ఒక్కొక్క భారత ఆటగాడే తప్పుకుంటున్నాడు. తాజాగా, సచిన్ టెండూల్కర్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా అతను వన్డే సిరీస్‌కు దూరమవుతున్నాడు. ఇప్పటికే కీలక ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. సచిన్ టెండూల్కర్కు నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు. సిరీస్ నుంచి టెండూల్కర్ తప్పుకుంటున్న విషయాన్ని జట్టు మేనేజర్ శివలాల్ యాదవ్ ప్రకటించారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు జరిగే చాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 ఈవెంట్‌లో కూడా సచిన్ ఆడకపోవచ్చు. దీంతో సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం మరింత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల కారణంగా ఇప్పటి వరకు వీరేందర్ సెహ్వాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ ఇంగ్లాండుతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు స్థానాలు కల్పించారు.
Comments