చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ నుంచి సైనా అవుట్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ నుంచి అవుటైంది. శుక్రవారం జరిగిన మహిళా సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్ చేతిలో సైనా ఓటమి పాలైంది. సైనా వాంగ్ చేతిలో 8-12, 12-21 స్కోరుతో పరాజయం పాలైంది. వాంగ్ చేతిలో కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే సైనా ఓటమి పాలైంది.
Comments