కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 23: ఇన్వెస్టర్లు ఎడాపెడా అమ్మకాలకు దిగడంతో గురువారం ఇతర ఆసియా మార్కెట్లతో పాటు భారత్ స్టాక్ మార్కెట్ కూడా తీవ్రంగా స్పందించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా గ్యాప్ డౌన్‌తో 16,828 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమయ్యింది. ఆతర్వాత ఇక ఏ దశలోనూ కోలుకునే సంకేతాలివ్వని సెన్సెక్స్ ఒకానొక దశలో 16,316 పాయింట్ల కనిష్టానికి ( 749 పాయింట్ల పతనం) కూడా పడిపోయింది.చివరకు 704 పాయింట్లు(4.13 శాతం) కుప్పకూలి 16,361 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇది దాదాపు నెలరోజుల కనిష్టస్థాయి ముగింపు కావడం గమనార్హం. , గడిచిన రెండేళ్లలో సెన్సెక్స్ ఒక్కరోజులో ఈ స్థాయి(శాతాల్లో చూస్తే) పతనాన్ని చూడటం ఇదే తొలిసారి. అంతక్రితం 2009, జూలై 6న బీఎస్‌ఈ సెన్సెక్స్ 870 పాయింట్ల భారీ క్షీణతను చవిచూసింది. కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా గురువారం 209.60 పాయింట్లు(4.08%) క్షీణించి 5,000 కిందికి పడిపోయింది. 4,923.65 వద్ద స్థిరపడింది.
Comments