సమ్మెట పై సర్కార్ ఊరట చర్యలు
హైదరాబాద్, సెప్టెంబర్ 20: సకల జనుల సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. ప్రజలకు విద్యుత్. రవాణా ఇబ్బందులను తగ్గించేందుకు రెండు టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, సింగరేణి కాలరీస్, జెన్‌కో, ట్రాన్స్కో ఎండిలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ బొగ్గు, సహజ వాయువుల కేటాయింపు, సరఫరా, ఉత్పత్తి వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండి, పోలీసు అధికారులతో ఏర్పాటైన మరో టాస్క్ ఫోర్స్ రవాణా సమ్మె వల్ల కలిగే సమస్యలను అధిగమించే అంశాలను పర్యవేక్షిస్తుంది. రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా ఎంఎంటిఎస్, లోకల్ రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వే అధికార్లను కోరారు. తెలంగాణ ప్రాంతంలో తిరిగేందుకు టూరిస్టు, ప్రైవేటు వాహనాలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిత్యావసర వస్తువులు సక్రమంగా ప్రజలకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా బొగ్గు నిల్వలు పడిపోతుండడంతో విద్యుత్ సంక్షోభం తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆప్రమత్తమైన ప్రభుత్వం బయట ప్రాంతాల నుంచి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
Comments