కాంగ్రెస్ వీక్ నెస్ తిమోరీ కనిపెట్టేశాడు...!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5. "టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దీక్ష నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు తలొగ్గడం ద్వార కాంగ్రెస్ ప్రతిష్ఠ దెబ్బ తిన్నదని, బెదిరింపులకు తేలిగ్గా లొంగిపోయే బలహీనమైన పార్టీ గా కాంగ్రెస్ పై ముద్ర పడిందని భారత్‌లో అప్పటి అమెరికా రాయబారి తిమోతీ రోమర్ అభిప్రాయ పడ్డారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణపై కేంద్రం ప్రకటన, అనంతర పరిణామాలపై రోమర్ తన మాతృదేశానికి ఆ మర్నాడే పంపిన రహస్య కేబుల్‌లో ఈ విషయాలున్నాయి. వికీలీక్స్ ఈ కేబుల్‌ను బయటపెట్టింది. తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం.. ఆ పార్టీ నేతల మధ్య చీలికకు కారణమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయం.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఘన విజయమన్నారు. "లోక్‌సభలో కేవలం రెండు, అసెంబ్లీలో ఆరు స్థానాలను మాత్రమే ప్రస్తుతం కలిగి ఉన్న టీఆర్ఎస్.. యూపీఏతో గొడవ పెట్టుకొని.. గెలవడం ఘన విజయమే'' అని వ్యాఖ్యానించారు. "ఓ ప్రాంతీయ నాయకుడి డిమాండ్లకు తేలిగ్గా తలొగ్గిన కాంగ్రెస్‌ను బలహీనమైన, వెన్నెముక లేని పార్టీగా మీడియా అభివర్ణిస్తోంది'' అని ఈ కేబుల్‌లో రోమర్ పేర్కొన్నారు.మరిన్ని ప్రత్యేకరాష్ట్ర డిమాండ్లను కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. "2009 సెప్టెంబర్‌లో వైఎస్ మరణంతో ఎదురైన సంక్షోభం నుంచి బయటపడే దశలో కాంగ్రెస్.. తెలంగాణ డిమాండ్‌ను ఆమోదించడం ద్వారా కొత్త రాష్ట్రాల తేనెతుట్టెను కదిలించిందని రోమర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వ్యాపార రంగంపై ఆధిపత్యం కలిగివున్న రెండు బలమైన రజకీయ సామాజిక వర్గాలు.. హైదరాబాద్‌ను తెలంగాణ వారికి తేలికగా ఇచ్చే అవకాశం లేదని ఆయన విశ్లేషించారు.

Comments