చింతకాయల పోకిరి...!
వెంకటేష్, మహేష్ బాబు కలిసి తొలిసారిగా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో దిల్ రాజ్ నిర్మించే ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభం కావచ్చు. . ఈ చిత్రానికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే టైటిల్ రిజిస్టర్ చేసి ఉంచారు. ప్రస్తుతం వెంకటేష్ 'గంగ ది బాడీగార్డ్' చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం మొదలవుతుందని అంటున్నారు. మహేష్ బాబు ‘దూకుడు’ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతూనే మరో పక్క 'బిజినెస్ మెన్' సినిమా చేస్తూనే, మరోపక్క మధ్యలో ఈ సినిమాకు కొన్ని డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. దిల్ రాజ్ ప్రస్తుతం ఈ సినిమా మీద పూర్తి కాన్సంట్రేషన్ పెడుతున్నాడట.

Comments