తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్,సెప్టెంబర్ 26: కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు మెల్లిమెల్లిగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1616 (-40) డాలర్లు ఉండగా, ఔన్స్ వెండి ధర 28 (-3) డాలర్లు పలుకుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,270 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.25,500 ఉంది. అలాగే కిలో వెండి ధర 50,530 ఉంది.
Comments