ఢిల్లీ తిరిగి వచ్చిన సోనియా
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 8: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. గతనెల 2వ తేదీన ఆమె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. నెల రోజులపైగా విశ్రాంతి అనంతరం సోనియా భారత్‌కు తిరిగి వచ్చారు. సోనియా తన కుమార్తె ప్రియాంకతో కలిసి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోనియా లేని సమయంలో పార్టీ బాధ్యతలను చూసేందుకు రాహుల్‌గాంధీ, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేదీతో నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

Comments