చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ దే గెలుపు
కార్డిఫ్,సెప్టెంబర్ 17: భారత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్ విజయం సాధించి వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. విజయానికి కావాల్సిన 241 పరుగుల్ని ఇంకా పది బంతులు ఉండగానే ఇంగ్లాండ్ సాధించింది. .5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్ 3-0 తేడాతో గెలుపొందింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 304 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత జట్టులో కోహ్లీ 107, ద్రావిడ్ 69, ధోని 50 పరుగులు చేశారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించి 241 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచారు. కెప్టెన్ కుక్, ట్రాట్‌లు రాణించి అర్ధ సెంచరీలు సాధించారు. చివర్లో రవి బొపారా, బెయిర్‌స్టో ధాటిగా ఆడటంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వశమైంది. ఇంగ్లాండ్ జట్టులో కుక్ 50, కిస్వెట్టర్ 21, ట్రాట్ 63, బెల్ 26, బొపారా 37, బెయిర్‌స్టో 41 పరుగులు చేశారు.
Comments