వివాదంలో బాలూ కుమారుడు...!
చెన్నై,సెప్టెంబర్ 20: కోలీవుడ్ నటి సోనాతో అసభ్యకరంగా ప్రవ ర్తించిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా నేపథ్య గాయకుడు ఎస్పీబీ చరణ్ బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోనా అసత్య ప్రచారం చేస్తోందని, తప్పుడు ఫిర్యాదు ఇచ్చిందని తెలిపారు. నటుడు వైభవ్ ఇంట్లో జరిగిన విందులో చరణ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, బలాత్కారం కూడా చేయబోయాడని సోనా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాండిబజార్ పోలీసులు చరణ్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్న సోనా డిమాండ్‌కు చరణ్ అంగీకరించే అవకాశాలు కన్పించడం లేదు. తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చరణ్ అంటున్నాడు.

Comments