తెలంగాణ ఒత్తిడి: ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
హైదరాబాద్,సెప్టెంబర్ 18: తెలంగాణవాదుల ఒత్తిడికి తలొగ్గి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు వారు వేర్వేరుగా స్పీకర్ కార్యాయానికి రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు పంపారు.
Comments