విషమంగానే అయాజ్ ఆరోగ్యం
హైదరాబాద్,సెప్టెంబర్ 12: : ఆదివారం నాడు హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు సోమవారం తెలిపారు. అయాజ్ అవయవాలు పనిచేయటం లేదని వారు వెల్లడించారు.కాగా, అయాజుద్దీన్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై 304/ఏ, 337 సెక్షన్ల కింద సుమోటోగా కేసు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.బైక్ రేసింగ్ చేస్తుండగా మహ్మద్ అయా జుద్దీన్(19) తీవ్ర గాయాల పాలవగా.. అజహర్ సోదరి కుమారుడు అజ్మల్ ఉర్ రెహమాన్(16) ప్రాణాలు కోల్పోయాడు. అతి వేగంతో బైక్ నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ వార్త తెలిసి లండన్ లో ఉన్న అజారుద్దీన్ సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.
Comments