మూడో వన్డేలోనూ భారత్ ఓటమి
లండన్,సెప్టెంబర్ 10: ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓడిపోయింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 43 ఓవర్లలో 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఇంగ్లండ్ 41.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 2 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్‌లోనూ రాణించిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments