ఓటుకు నోటు కేసులో అమర్ సింగ్ అరెస్టు
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 6 : ఓటుకు నోటు కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ అరెస్టయ్యారు. తన ఆరోగ్యం సరిగా లేనందున కోర్టుకు హాజరు కావడం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన మంగళవారం ఉదయం కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. దాంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు. అమర్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీంతో అమర్ సింగ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బిజెపి మాజీ పార్లమెంటు సభ్యులు ఫగ్గన్ సింగ్ కులస్తే, మహవీర్ సింగ్ భంగోరా బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. వారిద్దరిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు.
Comments