యు.ఎస్.లో సల్మాన్ కు సర్జరీ...
ముంబై,సెప్టెంబర్ 1 : ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధితో గత కొద్దికాలంగా బాధ పడుతున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌కు అమెరికా ఆస్పత్రిలో సర్జరీ నిర్వహించారు. సర్జరీ కోసం ఆగస్టు 29 తేదిన సల్మాన్ యూఎస్ వెళ్లారు.సల్మాన్‌కు పదిహేను రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు వెల్లడించారు. సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత మరోసారి పరీక్షలు జరుపుతామన్నారు. సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత ‘ఏక్ థా టైగర్’ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు సల్లూభాయ్ దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు.
Comments