అక్టోబర్ 13 న బాన్సువాడ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 7: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక అక్టోబర్ 13 న జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే పదవిని వీడటంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. రాష్ట్రం లోని బాన్సువాడతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు నియోజవకర్గానికి కూడా ఇదే రోజు ఉప ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి(పశ్చిమ), పుదుచ్చేరిలోని ఇందిరానగర్, మహారాష్ట్రలోని ఖడక్వాసలా, బీహార్‌లోని దరౌందా అసెంబ్లీ నియోజకవర్గాలకు, హర్యానాలోని హిస్సార్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Comments