ప్రధానితో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ
న్యూఢిల్లీ,జూన్ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయినవారిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ఉన్నారు. భేటీ అనంతరం వారు మీడియా తో మాట్లాడుతూ, తెలంగాణ విషయంలో ఇక జాప్యం చేయవద్దని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కోరామని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజల్లోకి తిరగలేని పరిస్థితిని ప్రధానికి వివరించామన్నారు. ఈ విషయంలో జాప్యం చేస్తే పదవులకు రాజీనామాలు చేస్తామని చెప్పామన్నారు. తమకు పదవుల కంటే తెలంగాణయే ముఖ్యమని స్పష్టం చేశామన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి చెప్పారని తెలిపారు.
Comments