వెస్టిండీస్‌పై బోణీ కొట్టిన భారత్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ,జూన్ 7: తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 44.5 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఆరంభంలోనే పార్థీవ్ పటేల్ (13), విరాట్ కోహ్లి (2) నిష్ర్కమించినా... ఓపెనర్ శిఖర్ ధావన్ (76 బంతుల్లో 51, 1 సిక్స్, 3 ఫోర్లు) రాణించాడు. అనంతరం రోహిత్ శర్మ (75 బంతుల్లో 68 నాటౌట్, 1 సిక్స్, 3 ఫోర్లు), కెప్టెన్ సురేశ్ రైనా (50 బంతుల్లో 43, 4 ఫోర్లు)లు ఐదో వికెట్‌కి 80 పరుగులు జోడించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
Comments