కెనడాలో రాజ్‌కపూర్ వీధి ...
బ్రాంప్టన్,జూన్ 26: బాలీవుడ్ ‘షో మ్యాన్’ రాజ్‌కపూర్‌కు కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాసియా సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే టొరంటో శివారు పట్టణం బ్రాంప్టన్‌లోని ఓ వీధికి రాజ్‌కపూర్ గౌరవార్థం ఆయన పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్‌కపూర్ సతీమణి కృష్ణ రాజ్‌కపూర్, కుమారులు రణధీర్ కపూర్, రిషీ కపూర్, రాజీవ్ కపూర్, కుటుంబసభ్యులు రీమా, రీతు, నీతు హాజరయ్యారు. బ్రాంప్టన్ మేయర్ సుశాన్ ఫెన్నెల్.. రాజ్‌కపూర్ పేరు ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రణధీర్‌కపూర్ మాట్లాడుతూ.. ‘‘ఈ మధుర జ్ఞాపకాన్ని మేం ఎన్నటికీ మర్చిపోలేం. మాతృదేశానికి కొన్ని వేల మైళ్ల దూరంలో మా తండ్రికి చాలా గొప్ప గౌరవం దక్కింది’’ అని పేర్కొన్నారు.

Comments