హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్ మృతి
హిస్సార్ ,జూన్ 3: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ గుండెపోటుతో హిస్సార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. 1979-85, 1991-1996 కాలంలో హర్యానా రాష్ట్రానికి భజన్‌లాల్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజీవ్ గాంధి ప్రభుత్వంలో వ్యవసాయం, పర్యావరణం, అడవుల శాఖను భజన్‌లాల్ నిర్వహించారు. హర్యానా రాజకీయాల్లో భూపిందర్ హుడాతో ఏర్పడిన విభేదాల కారణంగా హర్యానా జనహిత్ కాంగ్రెస్ పార్టీని భజన్‌లాల్ ఏర్పాటు చేశారు.
Comments