కనిమొళికి దొరకని బెయిల్
న్యూఢిల్లీ,జూన్ 20: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డీఎంకె ఎంపీ కనిమొళికి సుప్రీంకోర్టులోను చుక్కెదురు అయ్యింది. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ జీఎస్ సింఘ్వి సారధ్యంలోని డివిజన్ బెంచ్ సోమవారం కొట్టివేసింది. ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని ఉన్నత న్యాయస్థానం ఈసందర్భంగా కనిమొళికి సూచించింది. దాదాపు నెల రోజులుగా జైల్లో ఉన్న ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను తొలుత సీబీఐ కోర్టు, ఆతర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కలైంజర్ టీవీ ఎండీ శరత్‌కుమార్‌కు కూడా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.
Comments