నాగచైతన్య, అనుష్క నిశ్చితార్థం నిజం కాదట...
చెన్నై,జూన్ 16: ప్రముఖ సినీ హీరో నాగార్జున తనయుడు నాగచైతన్య, ప్రముఖ కథానాయిక అనుష్కను వివాహమాడబోతున్నట్లు, అందుకు నిశ్చితార్థం కూడా జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి. నాగచైతన్య, అనుష్కల నిశ్చితార్థం గురించి ముందుగా ఓ తమిళ పత్రికలో కథనం రావడం, దాని ఆధారంగా పలు వెబ్‌సైట్లు, చానెళ్లలో ఈ కథనం రావడం తెలుగు సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్తా కథనాలను సినీ పరిశ్రమ వర్గాలతోపాటు స్వయంగా కథానాయిక 'అనుష్క కూడా ఖండించారు. ‘ నాగచైతన్య నాకంటే చాలా చిన్నవాడు. అతనితో నాకు పెళ్లేమిటీ ' అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది పూర్తిగా అవాస్తవం’ అని ఆమె అన్నారు. నాగచైతన్య ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన ‘దడ’ సినిమా షూటింగ్ నిమిత్తం యూరప్‌లో ఉన్నారు.

Comments