కడప కలెక్టర్ పై బదిలీ వేటు
హైదరాబాద్,జూన్ 15: ఊహించినట్లే వైఎస్‌ఆర్ కడప జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్ పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బదిలీ వేటు వేశారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిం చినందున శశిబూషణ్‌కుమార్‌ను ప్రాధాన్యత లేని శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఎండీగా బదిలీ చేశారు. లోగడ చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ అభ్యర్థికి సహకరించనందుకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్నను ప్రాధాన్యత లేని రైతుబజార్ సీఈఓగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఇప్పుడు కడప జిల్లా కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ పై బదిలీ వేటు పడింది. టీటీడీ ఈఓ కృష్ణారావును బదిలీ చేసి అక్కడ ఆర్థికశాఖలో పనిచేస్తున్న ఎల్.వి.సుబ్రహ్మణ్యంను ఆ పదవి లో నియమించారు. సమాచార శాఖ కమిషనర్‌గా పార్థసారధి స్థానంలో బుర్రా వెంకటేశంను నియమించారు.

Comments