రెండో వన్డేలో కూడా వెస్టిండీస్‌పై భారత్ విజయం
ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్,జూన్ 9: వరుసగా రెండో వన్డేలో కూడా వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ను టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడించింది. మరో 21 బంతులు మిగులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలింగించడంతో టీమిండియా లక్ష్యాన్ని 37 ఓవర్లలో 183 పరుగులకు కుదించారు. కొహ్లి(81), పార్థీవ్ పటేల్(56) అర్థసెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. కొహ్లికి ‘మ్యాన్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించింది.
Comments