పిసిసి కొత్త చీఫ్ బొత్స
న్యూఢిల్లీ,జూన్ 6: పిసిసి అధ్యక్షునిగా డి.శ్రీనివాస్ స్థానంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన నియామకాన్ని ఆమోదించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నేతలతో సత్సంబంధాలు ఉన్న బొత్స గతంలో బొబ్బిలి లోక్ సభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు.

Comments