రాందేవ్‌తో ప్రభుత్వ చర్చలు విఫలం
న్యూఢిల్లీ,జూన్ 3: యోగా గురువు బాబా రాందేవ్ తో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. దీనితో సత్యగ్రహం పేరుతో ఆమరణ దీక్ష యధావిధిగా జరుగుతుందని రాందేవ్ బాబా తెలిపారు.. దేశరాజధానిలోని ఓ హోటల్ బాబా, కేంద్రమంత్రి సిబాల్‌ల మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్న సిబాల్ నల్లధనంపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా వుందని తెలిపినట్టు సమాచారం.

Comments