పెషావర్‌లో పేలుళ్లు: 34 మంది మృతి
పెషావర్,జూన్ 12: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 34 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన అతి దారుణమైన పేలుళ్లు ఇవే. రాజకీయ నాయకులు, సైనికాధికురాలు నివాసం ఉండే పెషావర్ ప్రాంతంలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. సిఐఎ చీఫ్ పెనెట్టా పర్యటన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు.
Comments