ముంబై కి' బెజవాడ రౌడీలు '
హైదరాబాద్,మే 26: విజయవాడలో ' బెజవాడ రౌడీలు ' సినిమా షూటింగుకు న్యాయవాదులు అభ్యంతర పెట్టడంతో పోలీసులు అనుమతి రద్దు చేశారు. తమకు స్క్రిప్టు ఇస్తే, న్యాయ నిపుణుల సలహా తీసుకుని షూటింగుకు అనుమతి ఇచ్చే విషయంపై ఆలోచన చేస్తామని విజయవాడ పోలీసు కమిషనర్ చెప్పారు. దీనితో చిత్రం షూటింగ్ ని ముంబై కి షిప్ట్ చేసి మిగతా పార్ట్ ని ఫినిష్ చేయాలని రాంగోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాలేశ్వరరావు మార్కెట్, కృష్ణా నది, దుర్గా ఆలయం ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయటంతో కీలకమైన సీన్స్ వచ్చేసాయని, మిగిలినవి అవసరమైతే గ్రాఫిక్స్ లో చూసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. నాగచైతన్య కథానాయకుడిగా శ్రేయా ప్రొడక్షన్స్ పతాకంపై వివేక్ కృష్ణ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, శుభలేఖ సుధాకర్, ముకుల్‌దేవ్, అజయ్, అశోక్ కుమార్, ఫణి, భరత్, శ్రావణ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Comments