రైతు ఉద్యమ నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ మృతి
లక్నో,మే 15: రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షులు మహేంద్ర సింగ్ తికాయత్ ఉత్తరప్రదేశ్‌లోని కుమారుడి నివాసంలో ఆదివారం తెల్లవారుఝామున అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. తికాయత్ గత కొద్దికాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. తికాయత్ ఉత్తర భారత దేశంలో రైతు సమస్యలపై పలు ఉద్యమాలు సాగించారు. రైతుల హక్కులకు మద్దతుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం గా ఆందోళనలు నిర్వహించారు. పలుసార్లు అరెస్టయ్యారు.

Comments