సత్తా చూపిన పంజాబ్ కింగ్స్
ధర్మశాల,మే 18: ఇక్కడి హెచ్‌పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐ.పి.ఎల్. మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 111 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వాల్తాటి (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆరంభంలో వేగంగా ఆడాడు. వాల్తాటి ఉన్నంతసేపు ప్రేక్షక పాత్ర పోషించిన గిల్‌క్రిస్ట్... ఆ తర్వాత చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లను బెదరగొట్టాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై ఘోరపరాజయాన్ని చవిచూసింది.
Comments