జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ కు నెహ్రూ అవార్డ్
న్యూఢిల్లీ,మే 10: ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన పురస్కారానికి జర్మనీ చాన్సెలర్ అంజెలా మెర్కెల్ (57) ఎంపికయ్యారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని కమిటీ 2009 సంవత్సరానికి గానూ ఈ అవార్డ్ కు మెర్కెల్‌ను ఎంపిక చేసింది. న్యాయబద్ధమైన, సంతులిత అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుపరిపాలనతో పాటు 21 శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోగలస్థాయిలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టి0చే లక్ష్యంతో ఆమె పనిచేశారని ఆ ప్రకటనలో ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం మెర్కెల్ కృషి చేశారని పేర్కొన్నారు. అవార్డ్ కింద రూ.కోటి, ప్రశంసాపత్రం, ట్రోఫీ అందజేస్తారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, మదర్ థెరిసా, సూకీ, ముబారక్, మండేలా తదితరులు గతంలో ఈ పురస్కారం అందుకున్నారు.
Comments