విశ్రాంతి కోసం విదేశాలకు రజనీ కాంత్
చెన్నై, మే 12: దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ వైద్యుల సలహా మేరకు విశ్రాంతి కోసం విదేశాలకు పయనం కానున్నారు. ఈ కారణంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాణా’ షూటింగ్ వాయిదాపడింది. రాణా షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాడే రజనీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా మళ్లీ అస్వస్థతకు గురవడంతో మైలాపూర్‌లోని ఇస్‌బెల్లా ఆస్పత్రిలో చేర్చారు. వారం రోజులు ఆస్పత్రిలోనే ఉన్న ఆయన మంగళవారం రాత్రి డిశ్చార్జి అయ్యారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజనీకి వైద్యులు సలహా ఇచ్చారు. చెన్నైలో తీవ్రమైన ఎండలు కారణంగా అమెరికా లేదా స్విట్జర్లాండ్ వెళ్లేందుకు రజనీకాంత్ వీసా సిద్ధం చేసుకుంటున్నారు.
Comments