నిరాశ పడక్కర్లే: సి.ఎం.
హైదరాబాద్,మే 13: ఉప ఎన్నికలలో ఓటమికి ఎవరూ బాధ్యత వహించవలసిన అవసరంలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫలితాలు వెలువడిన తరువాగత సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలలో ఇటువంటివి సహజమని అన్నారు. ఇటువంటి ఫలితాలు చాలా ఎన్నికలలో చూశామన్నారు. ప్రత్యేక పరిస్థితులలో ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రావలసిన ఓట్లు వైఎస్ కుటుంబ సభ్యులకు మళ్లాయన్నారు. వైఎస్ఆర్ పై ఉన్న గౌరవాన్ని ప్రజలు చూపించారని తెలిపారు. ప్రజల తీర్పుని గౌరవిస్తామన్నారు. అందరూ కష్టపడి పనిచేసినా ప్రజల మద్దతు వారికి ఉందని, ప్రజాస్వామ్యంలో గొప్ప తనం ఇదేనని ఆయన అన్నారు.

Comments