న్యూఢిల్లీ,మే 17: ఐసీఎస్ఈ ఫలితాలను విడుదల చేశారు. పదవ తరగతిలో 98.61, పన్నెండవ తరగతిలో 97.24 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఫలితాలను సిబిఎస్ఇ రిజల్ట్సు డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో వుంచారు.
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం లోని స్వగ్రామం మందలపర్రులో తుదిశ్వాస వదిలారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. శిమరామరాజుకు వారసులు లేకపోవడంతో తన ఆస్తులను దాన ధర్మాలకు ధారాదత్తం చేశారు.శివరామరాజు తన పేరిట ఉన్న 11 ఎకరాల భూమిలో 9 ఎకరాలను వివిధ దేవస్థానాలు, మిత్రులు, తెలుగుదేశం పార్టీకి రాసి ఇచ్చారు. బువ్వనపల్లి గ్రామంలో ఉన్న ఉమా మార్కెండేయస్వామి ఆలయానికి రెండెకరాల భూమి, పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలోని ఉమామార్కండేయస్వామి ఆలయానికి ఒక ఎకరం భూమి, అత్తిలిలోని వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఒక ఎకరం వితరణగా ఇచ్చారు.
విశాఖపట్నం,అక్టోబర్ 28: ప్రముఖ సాహితీవేత్త, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు అనారోగ్యంతో విశాఖలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. అవసరాల మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.
న్యూఢిల్లీ,డిసెంబర్ 12: ప్రముఖ పారిశ్రామికవేత్త విజయమాల్యాకు చెందిన పౌర విమానయాన సంస్థ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డిసెంబర్ 15 నుంచి ఏడు రూట్లలో కొత్తగా 14 విమానాలను ప్రారంభినున్నట్లు ప్రకటించింది.న్యూఢిల్లీ-హైదరాబాద్, న్యూఢిల్లీ-చెన్నయ్, న్యూఢిల్లీ-భువనేశ్వర్, ముంబయి-లక్నో రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ కొత్త విమానాలు మరిన్ని ఆప్షన్లను ఇవ్వనున్నాయి.ఈ కొత్త విమానాల వల్ల భారత్లోని మెట్రోపాలిటన్ నగరాలు, ఇతర ముఖ్యమైన పట్టణాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రతినిథి తెలిపారు.
Comments